Breaking News

కరెంట్ అఫైర్స్ 26-ఆగష్టు-2019

ఈ ఉదయం ప్రముఖ దినపత్రికలలో ప్రచురితమైన జాతీయ, అంతర్జాతీయ, ఆర్థిక మరియు బ్యాంకింగ్, సైన్స్ & టెక్నాలజీ (S&T), క్రీడలు, అవార్డులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వార్తల్లోని వ్యక్తులు, పుస్తకాలు & రచయితలు, మొదలైన అంశాల నుండి ప్రధాన కరెంట్ అఫైర్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షల దృష్ట్యా వీటిని అంశాలవారీగా అమర్చడం జరిగింది.
current-affairs-in-telugu-26-august-2019-womens-equality-day-telugumaterial.in


నేటి విశిష్టత 

  • మదర్ థెరిసా యొక్క 109వ జయంతిని 2019 ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. మదర్ థెరిసా ఆగష్టు 26, 1910న జన్మించారు.
  • అమెరికాలో మహిళలకు ఓటు హక్కును కల్పించేందుకు వీలుగా 19వ రాజ్యాంగ సవరణ అమోదం పొందిన రోజైన  ఆగస్టు 26న ప్రతి సంవత్సరం మహిళా సమానత్వ దినోత్సవాన్ని జరుపుకుంటారు.



జాతీయం

  • ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వింటర్ / ఫెస్టివల్ -2019 లో కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రాజెక్ట్ SU.RE ను ప్రారంభించారు. 
    • పరిశుభ్రమైన వాతావరణానికి దోహదపడే స్థిరమైన ఫ్యాషన్ వైపు దృష్టి సారించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. 
    • (SU.RE = Sustainable Resolution)




అంతర్జాతీయం 

  • అబుదాబిలోని ఎమిరేట్స్ ప్యాలెస్‌లో 2019 ఆగస్టు 24 న యుఏఈలో రుపే కార్డును ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా విడుదల చేశారు. 
    • దీనితో, యుఏఈ భారత రుపే కార్డు ప్రారంభించిన మొదటి గల్ఫ్ దేశంగా అవతరించింది.

  • జీ-7 సదస్సులో పాల్గొనేందుకు ఆగస్టు 25న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌లోని బియారిట్జ్‌కు చేరుకున్నారు. 
    • పర్యావరణం తదితర సమకాలీన అంశాలపై మోదీ ఈ సదస్సులో ప్రసంగించనున్నారు. 
    • జీ-7 కూటమి దేశాల్లో భారత్ లేకపోయినప్పటికీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ వ్యక్తిగత ఆహ్వానం మేరకు మోదీ ఈ సమావేశాల్లో పాల్గొంటారు.


ఎకానమీ


  • పెండింగ్‌లో ఉన్న అన్ని జీఎస్‌టీ రీఫండు వాపసు 30 రోజుల్లోపు ఎంఎస్‌ఎంఈలకు తిరిగి ఇవ్వబడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

  • దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 2018-19 ఖరీఫ్, రబీ సీజన్ల ఉత్పత్తి నాలుగో ముందస్తు అంచనాల నివేదికను కేంద్ర వ్యవసాయశాఖ విడుదల చేసింది. 
    • ఈ నివేదిక ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆహారధాన్యాల ఉత్పత్తి 27.74 కోట్ల టన్నులు కాగా, 2018-19 ఆర్థిక సంవత్సరం సీజన్‌లో ఏకంగా28.49 కోట్ల టన్నులకు పెరిగింది. 
    • గత సంవత్సరంతో పోలిస్తే కీలకమైన వరి, నూనె గింజలు, మొక్కజొన్న, వేరుశనగ, చెరుకు ఉత్పత్తి కాస్త పెరిగాయి. మరియు పత్తి, పప్పుధాన్యాల దిగుబడి కాస్త తగ్గింది. 



క్రీడలు

  • పీవీ సింధు బీడబ్ల్యుఎఫ్ ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో స్వర్ణం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించారు. 
    • స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో జరిగిన ఫైనల్లో ఆమె 21-7, 21-7తో వరుస సెట్లలో నోజోమి ఒకుహారాను ఓడించి ప్రపంచ ఛాంపియన్ టైటిల్  గెలుచుకుంది. 
    • ఈ విజయంతో 42 ఏళ్ల ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక పతకాలు గెలిచిన ప్లేయర్‌గా చైనా క్రీడాకారిణి జాంగ్ నింగ్ (1 స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) సమం చేసింది. 
    • ఈ విజయంతో సింధుకు 13వేల ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.



  • కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో డురాండ్ కప్ -2019 ఫైనల్ మ్యాచ్ జరిగింది. 
    • గోకులం కేరళ కెప్టెన్ మార్కస్ జోసెఫ్ ప్రతి అర్ధభాగంలో ఒక గోల్ చేసి డ్యూరాండ్ కప్ -2019 ను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.


అవార్డులు

  • కీలకమైన గల్ఫ్ దేశమైన బహ్రెయిన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి చేసిన కృషికి గుర్తింపుగా ప్రధాని నరేంద్ర మోదీకి బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ‘కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రినైజెన్స్’ ప్రదానం చేశారు. 
    • బహ్రెయిన్ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచారు. 
    • మోదీ పర్యటన సందర్భంగా 250 మంది భారతీయ ఖైదీలను బహ్రెయిన్ ప్రభుత్వం విడుదల చేసి తన మానవత్వాన్ని చాటుకుంది. 
    • బహ్రెయిన్‌లో 200 ఏళ్ల పురాతనమైన శ్రీనాథ్‌జీ శ్రీకృష్ణుడి ఆలయాన్ని పునరభివృద్ధి చేసేందుకు రూ. 30 కోట్ల విలువైన వనరులను మోదీ ప్రారంభించారు. 



  • ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) 2019 సంవత్సరానికిగాను ప్రతిష్టాత్మక ‘ప్రముఖ ఇంజనీర్ అవార్డు’ (Eminent Engineer Award) కు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (సీపీడబ్ల్యుడి) డైరెక్టర్ జనరల్ ప్రభాకర్ సింగ్ ఎంపికయ్యారు. 
    • ఈ ఎలైట్ అండ్ ప్రెస్టీజియస్ అవార్డును సెప్టెంబర్ 15, 2019 న ‘ఇంజనీర్స్ డే’ సందర్భంగా ఆయనకు ప్రదానం చేస్తారు.


సైన్స్ & టెక్నాలజీ:

  • అంతరిక్షంలో తొలి నేరం: 
    • నాసా అంతరిక్ష కార్యక్రమంలో భాగంగా అన్నె మెక్‌క్లెయిన్ అనే మహిళా వ్యోమగామి సుమారు 6 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో గడిపారు. ఆమెకు భూమి మీద సమ్మర్ వోర్డన్స్ అనే ‘భార్య’ ఉన్నారు. వోర్డన్స్ కు తెలియకుండా ఆమె వ్యక్తిగత ఆర్థిక పత్రాలు, బ్యాంకు ఖాతాలను క్లెయిన్ ఐఎస్‌ఎస్‌లో ఉన్నప్పుడు వినియోగించారు. 
    • వోర్డన్స్ ఇదే విషయంపై  ఫెడరల్ ట్రేడ్ కమిషన్‌కు మరియు నాసా విభాగానికి ఫిర్యాదు చేసారు. 
    • ప్రస్తుతం ఈ నేరం అమెరికా అంతరక్ష పరిశోధన సంస్థ నాసాలోని ఇన్‌స్పెక్టర్ జనరల్ దర్యాప్తు జరుపుతున్నారు. 


వార్యల్లోని వ్యక్తులు

  • బీజేపీ దిగ్గజ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీకి వేలాది మంది అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. 
    • గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ (66) ఆగస్టు 24న కన్నుమూసారు. 


ఆంధ్రప్రదేశ్

  • షెడ్యూల్ కులాల వారికి మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 25న ఉత్తర్వులు జారీ చేసింది. 
    • ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ మాదిగ సంక్షేమ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ రెల్లి, ఇతర కులాల సంక్షేమ కార్పొరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సాంఘీక సంక్షేమ శాఖ ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
    • ఏపీ కో-ఆపరేటివ్ సొసైటీస్ చట్టం-1964 ప్రకారం కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు. 

No comments