Breaking News

ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్విజ్ 26-ఆగష్టు-2019

august-26-mother-teresa-birth-anniversary-telugumaterial.in
ఈ ఉదయం ప్రముఖ దినపత్రికలలో ప్రచురితమైన జాతీయ, అంతర్జాతీయ, ఆర్థిక మరియు బ్యాంకింగ్, సైన్స్ & టెక్నాలజీ (S&T), క్రీడలు, అవార్డులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వార్తల్లోని వ్యక్తులు, పుస్తకాలు & రచయితలు, మొదలైన అంశాల నుండి ప్రధాన కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన అతి ముఖ్యమైన క్విజ్ ఇక్కడ ఇవ్వడం జరుగుచున్నది. ఇవి పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే అభ్యర్థులకే కాకుండా పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు మరియు సమాజంపై ఎప్పటికప్పుదు మంచి అవగాహన కలిగి ఉండేందుకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. 


నేడు ఆగస్టు 26: మదర్ థెరిసా ఆగష్టు 26, 1910న జన్మించారు. మదర్ థెరిసా యొక్క 109వ జయంతిని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. 



1. బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకున్న తొలి భారతీయ క్రీడాకారులు ఎవరు?
ఎ) అశ్విని పొనప్ప
బి) రితుపర్ణ దాస్
సి) సైనా నెహ్వాల్
డి) పీవీ సింధు


2. ఈ క్రింది ఏ గల్ఫ్ దేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ రుపే కార్డును ప్రారంభించారు?
ఎ) యుఏఈ
బి) బహ్రెయిన్
సి) సౌదీ అరేబియా
డి) ఒమన్


3. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 'కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రినైజెన్స్' ప్రదానం చేసిన దేశం ఏది?
ఎ) బహ్రెయిన్
బి) యుఏఈ
సి) ఇజ్రాయెల్
డి) సుడాన్


4. పెండింగ్‌లో ఉన్న అన్ని జీఎస్‌టీ రీఫండు వాపసు ఎన్ని రోజుల్లోపు ఎంఎస్‌ఎంఈలకు తిరిగి ఇవ్వబడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు?
ఎ) 60 రోజులు
బి) 30 రోజులు
సి) 40 రోజులు
డి) 50 రోజులు


5. 2019 ఆగస్టు 26 న ఎవరి 109వ జయంతిని జరుపుకున్నారు?
ఎ) లేడీ డయానా
బి) క్వీన్ ఎలిజబెత్
సి) మదర్ థెరిసా
డి) మేడమ్ క్యూరీ


6. మహిళల సమానత్వ దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు?
ఎ) ఆగస్టు 25
బి) ఆగస్టు 24
సి) ఆగస్టు 23
డి) ఆగస్టు 26


7. కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రాజెక్ట్ SU.RE ను ఏ నగరంలో ప్రారంభించారు?
ఎ) న్యూ ఢిల్లీ
బి) ముంబై
సి) సూరత్
డి) పాటియాలా


8. డురాండ్ కప్ -2019 టైటిల్ గెలుచుకున్న జట్టు ఏది?
ఎ) మోహున్ బాగన్
బి) ఆర్మీ రెడ్
సి) ఎఫ్‌సి కొచ్చిన్
డి) గోకులం కేరళ ఎఫ్.సి.


9. భారతదేశంలోని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ అత్యుత్తమ ఇంజనీర్ అవార్డు -2019కి ఎవరు ఎంపికయ్యారు?
ఎ) అనూప్ రంజన్
బి) ప్రభాకర్ సింగ్
సి) విశ్వ ప్రతాప్ సింగ్
డి) అరవింద్ గౌర్


జవాబులు

1. (డి) పీవీ సింధు
పీవీ సింధు బీడబ్ల్యుఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించారు. ఆమె 21-7, 21-7తో వరుస సెట్లలో నోజోమి ఒకుహారాను ఓడించి ప్రపంచ ఛాంపియన్ టైటిల్  గెలుచుకుంది.

2. (ఎ) యుఏఈ
అబుదాబిలోని ఎమిరేట్స్ ప్యాలెస్‌లో 2019 ఆగస్టు 24 న యుఏఈలో రుపే కార్డును ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా విడుదల చేశారు. దీనితో, యుఏఈ భారత రుపే కార్డు ప్రారంభించిన మొదటి గల్ఫ్ దేశంగా అవతరించింది.

3. (ఎ) బహ్రెయిన్
కీలకమైన గల్ఫ్ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ప్రధాని నరేంద్ర మోదీకి బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ‘కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రినైజెన్స్’ ప్రదానం చేశారు. బహ్రెయిన్ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచారు.


4. (బి) 30
పెండింగ్‌లో ఉన్న అన్ని జీఎస్‌టీ రీఫండు వాపసు 30 రోజుల్లోపు ఎంఎస్‌ఎంఈలకు తిరిగి ఇవ్వబడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.


5. (సి) మదర్ థెరిసా
మదర్ థెరిసా యొక్క 109వ జయంతిని 2019 ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. మదర్ థెరిసా ఆగష్టు 26, 1910న జన్మించారు.


6. (డి) ఆగస్టు 26
అమెరికాలో మహిళలకు ఓటు హక్కును కల్పించేందుకు వీలుగా 19వ రాజ్యాంగ సవరణ అమోదం పొందిన రోజైన  ఆగస్టు 26 న ప్రతి సంవత్సరం మహిళా సమానత్వ దినోత్సవాన్ని జరుపుకుంటారు.


7. (బి) ముంబై
ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వింటర్ / ఫెస్టివల్ -2019 లో కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రాజెక్ట్ SU.RE ను ప్రారంభించారు. పరిశుభ్రమైన వాతావరణానికి దోహదపడే స్థిరమైన ఫ్యాషన్ వైపు దృష్టి సారించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. (SU.RE = Sustainable Resolution)


8. (డి) గోకులం కేరళ ఎఫ్.సి.
కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. గోకులం కేరళ కెప్టెన్ మార్కస్ జోసెఫ్ ప్రతి అర్ధభాగంలో ఒక గోల్ చేసి డ్యూరాండ్ కప్ -2019 ను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.


9. (బి) ప్రభాకర్ సింగ్
ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) 2019 సంవత్సరానికిగాను ప్రతిష్టాత్మక ‘ప్రముఖ ఇంజనీర్ అవార్డు’ (Eminent Engineer Award) కు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (సీపీడబ్ల్యుడి) డైరెక్టర్ జనరల్ ప్రభాకర్ సింగ్ ఎంపికయ్యారు. ఈ ఎలైట్ అండ్ ప్రెస్టీజియస్ అవార్డును సెప్టెంబర్ 15, 2019 న ‘ఇంజనీర్స్ డే’ సందర్భంగా ఆయనకు ప్రదానం చేస్తారు.

No comments