డెయిలీ క్విజ్ 18: బయాలజీ
Q1. గాలిలో కార్బన్డయాక్సైడ్ గాఢత అధికమగుట వలన ఏమి జరుగుతుంది?
a) జ్వలనీకరణం
b) అమ్ల వర్షం
c) అటవీ నిర్మూలన
d) గ్లోబల్ వార్మింగ్
Q2. ఈ క్రింది వానిని జతకూర్చుము :
జాబితా-I
a: గ్లూకోజ్
b: స్టార్చ్
c: మాల్టోస్
d: చితిన్
జాబితా-II
i: నైట్రోజన్ కలిగి ఉన్న పాలిసాకరైడ్ కార్పోహైడ్రెట్స్
ii: మోనోసాకరైడ్స్
iii: పాలీసాకరైడ్స్
iv: డైసాకరైడ్స్
ఇది సరియైన జోడింపు :
a) a-ii, b-iii, c-iv, d-i
b) a-iv, b-iii, c-ii, d-i
c) a-iii, b-ii, c-iv, d-i
d) a-ii, b-iv, c-iii, d-i
Q3. ఈ క్రింది వానిని జతకూర్చుము :
జాబితా-I
a: చెర్నోబైల్ విపత్తు
b: భోపాల్ విషాదం
c: ఓజోన్ రంధ్రం
d: కాంతిరసాయన స్మోగ్
జాబితా-II
i: పెరాక్సిఅసిటైల్ నైట్రేట్
ii: క్లోరోఫ్లోరో కార్బన్లు
iii: రేడియోధార్మిక పదార్ధాలు
iv: మీధైల్ ఐసోసైనేట్
ఇది సరియైన జోడింపు :
a) a-iv, b-iii, c-I, d-ii
b) a-iii, b-iv, c-ii, d-i
c) a-ii, b-I, c-iv, d-iii
d) a-ii, b-iv, c-I, d-iii
Q4. హెపారిన్ రక్తంలో ఉండు ఒక ప్రతిస్పందన పదార్ధము. ఇది రక్తాన్ని రక్తనాళాలలో గడ్డకట్ట కుండా ఉండుటలో దోహదపడును. ఇది ముఖంగా దీని నుండి ఉత్పన్నమగును :
a) వృక్కము
b) క్లోమము
c) కాలేయం
d) ప్లీహము
Q5. ఈ క్రిందివానిలో ఏది సముచితమైన సమ్మేళనం?
a: బార్లీ, వరి, ఓట్లు, జొన్న
b: అవిసెలు(Flax), బాదం, జీడిపప్పు, వాల్నట్లు
c: అవిసెలు (Flax), ఓట్లు, మొక్కజొన్న, రాగి
d: ఓట్లు, మొక్కజొన్న, రాగి, జొన్న
a) a మరియు b
b) b, c మరియు d
c) a, b మరియు d
d) c మరియు d
Q6. జతపరుచుము :
జాబితా-I
a: ఆస్పిరిన్
b: మ్యురియాటిక్ ఆమ్లం
c: ఇబూప్రోఫిన్
d: R. D. X.
జాబితా-II
i: సైక్లోట్రైమెధైలిన్ ట్రైనైట్రమైన్
ii: ఎసిటైల్ సాల్సిలిక్ ఆమ్లం
iii: హైడ్రోక్లోరిక్ ఆమ్లం
iv: అరైల్ మిధైల్ ఎసిటిక్ ఆమ్లం
a) a-iv, b-iii, c-ii, d-i
b) a-iv, b-ii, c-iii, d-i
c) a-ii, b-iii, c-iv, d-i
d) a-ii, b-iii, c-I, d-iv
Q7. ఈ క్రింది వానిలో శక్తిని ఇచ్చే అణువులను గుర్తించండి :
a) కార్బోహైడ్రేట్, ప్రోతీన్ మరియు లిపిడ్
b) కార్పోహైడ్రేట్, లిపిడ్ మరియు విటమిన్
c) కార్బోహైడ్రేట్, ప్రోటీన్ మరియు విటమిన్
d) ప్రోటీన్, లిపిడ్ మరియు విటమిన్
Q8. ఈ క్రింది ప్రవచనాలను అధ్యయనం చేయండి :
a: కిరణజన్య సంయోగక్రియలోని ‘నిష్కాంతి చర్య’ యందలి జీవరసాయన ఘటనలు కాంతిలేనపుడు జరుగుతాయి.
b: ఆవిరిరూపంలో మొక్కల నుండి నీరు కోల్పోవుటను ‘భాష్పోత్సేకం’ అంటారు.
c: జన్యుపరివర్తిత ‘గొల్డెన్ రైస్’ ను తినడం వల్ల అంధత్వము ఏర్పడుట నివారింపబడుతుంది.
ఈ ప్రవచనాలలో ఏది/ఏవి సరియైనది/వి :
a) a సరియైనది కాని b మరియు c సరియైనవి కావు
b) a మరియు c సరియైనవి కాని b సరియైనది కాదు
c) b మరియు c సరియైనవి కాని a సరియైనది కాదు
d) a, b c అన్నీ సరియైనవి
Q9. సరియైన వ్యాఖ్యలను గుర్తించండి :
a: 19వ శాతాబ్ధపు ‘గ్రేట్ ఐరిష్ కరువు’ కు కారణ హేతువు బంగాళాదుంపకు వచ్చిన లేట్ బ్లైట్ వ్యాధి.
b: వరి గోధుమ రంగు మచ్చ వ్యాధి, 1940 దశకంలో వచ్చిన బెంగాల్ కరువుకు కారణం.
c: Bt ప్రత్తిలో ప్రవేశపెట్టిన అన్యజన్యువు (foreign gene) బాక్టీరియల్ వ్యాధుల నుండి రక్షణ కలిపిస్తుంది.
d: క్రౌన్గాల్ అనేది ఒక వైరస్ వ్యాధి.
సరియైన వ్యాఖ్యాలు :
a) a, b
b) b, c
c) a, c
d) b, d
Q10. జతపరుచుము:
జాబితా-I
a: మైకాలజీ
b: పేలినాలజీ
c: అంకాలజీ
d: పేలియాంటాలజీ
జాబితా-II
i: పరాగ రేణువుల అధ్యయనం
ii: క్యాన్సర్ కి సంబంధించినది
iii: శిలాజాల గురించి అధ్యయనం
iv: శీలింధ్రాల గురించి అధ్యయనం
ఇది సరియైన జోడింపు :
a) a-iii, b-ii, c-I, d-iv
b) a-ii, b-iii, c-iv, d-i
c) a-iv, b-I, c-ii, d-iii
d) a-I, b-ii, c-iv, d-iii
Answers:
1. జవాబు: d
2. జవాబు: a
3. జవాబు: b
4. జవాబు: c
5. జవాబు: c
6. జవాబు: c
7. జవాబు: a
8. జవాబు: c
9. జవాబు: a
10. జవాబు: c

Good
ReplyDelete