డెయిలీ క్విజ్ 21: వ్యాపార గణితం
Q1. 6767 + 67 ను 68 తో భాగించగా వచ్చే శేషం:
a) 1
b) 65
c) 66
d) 67
Q2. ఒక గోళం ఘనపరిమాణం దాని ఉపరితల వైశాల్యానికి సమానమయ్యేది కేవలం వ్యాసార్థం (యూనిట్లలో) క్రింది సంఖ్యకు సమానమయినపుడు మాత్రమే:
a) 1
b) 2
c) 4
d) 3
Q3. ఐదులతో మాత్రమే ఏర్పడి,99 చే భాగించబడే ధన పూర్ణాంక సంఖ్యల్లో అతిచిన్న దానిలోని అంకెల సంఖ్య :
a) 9
b) 12
c) 15
d) 18
Q4. ఒక వస్తువును రూ. 1000కు అమ్మితే వచ్చిన లాభము, అదే వస్తువును రూ. 850కి అమ్మితే వచ్చే నష్టానికి రెండు రెట్లు. ఆ వస్తువును ఏ ధరకి అమ్మితే, అతనికి 30% లాభం వస్తుంది?
a) 1100
b) 1150
c) 1170
d) 1270
Q5. ఒక త్రిభుజంలోని కోణాలు 2 : 3 : 7 నిష్పత్తిలో ఉంటే, వాటిలో అతిపెద్ద కోణం:
a) 90°
b) 105°
c) 120°
d) 150°
Q6. చతుర్భుజం ABCD లోని భుజాలు AB, BC, CD మరియు DA ల మధ్య బిందువులు వరుసగా P, Q, R, S లైతే, అప్పుడు చతుర్భుజం PQRS ఒక :
a) చతురస్రం
b) సమచతుర్భుజం
c) దీర్ఘచతురస్రం
d) సమాంతర చతుర్భుజం
Q7. ఒక లంబ సమద్విబాహు త్రిభుజపు కర్ణం 12 సెంమీ. దాని వైశాల్యం (చ. సెం.మీ. లలో):
a) 12
b) 24
c) 36
d) 72
Q8. ఒక వ్యక్తి A నుండి Bకి కారు ప్రయాణం గంటకు 75 కి. మీ. వేగంతో చేసి, తిరుగు ప్రయాణంలో వేగాన్ని గంటకు 15 కి. మీ. తగ్గించాడు. ఈ మొత్తం ప్రయాణానికి నాలుగున్నర గంటలు పట్టితే A, Bల మధ్య దూరం (కి. మీ. లలో) :
a) 100
b) 120
c) 140
d) 150
Q9. ముగ్గురు వ్యక్తులు A, B, C లు రూ. 10,70,000 పెట్టుబడితో ఒక కంపెనీని ప్రారంభిస్తారు. B పెట్టుబడి కన్నా A పెట్టుబడి రూ. 50,000 ఎక్కువ, మరియు C పెట్టుబడి కన్నా B పెట్టుబడి రూ. 60,000 ఎక్కువ. ఆ కంపెనీకి రూ. 2,72,850 లాభం వస్తే అందులో A వాటా (రూపాయిలలో)
a) 1,04,550
b) 96,800
c) 91,800
d) 76,500
Q10. రెండు స్టేషన్లు A, B ల మధ్య దూరం 300 కి. మీ. A నుండి బయలు దేరి ఒక వ్యక్తి Bని చేరాలనుకుంటాడు. ఉదయం 10 గంటలకు, గంటకు 45 కి. మీ. వేగంతో మొదటి రెండు గంటలు కారు ప్రయాణించాక, వేగాన్ని పెంచి మిగతా దూరాన్ని ప్రయాణించి సా. 3.30 ని. లకు గమ్యస్ధానాన్ని చేరుకొనెను. మ. 12.00 నుండి సా. 3.30 వరకు అతను ప్రయాణించిన వేగం (గంటకు కి. మీ. లలో) :
a) 60
b) 65
c) 70
d) 75
Answers:
1. జవాబు: c
2. జవాబు: d
3. జవాబు: d
4. జవాబు: c
5. జవాబు: b
6. జవాబు: d
7. జవాబు: c
8. జవాబు: d
9. జవాబు: a
10. జవాబు: a

No comments