Breaking News

ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్విజ్ 02-06-డిసెంబర్-2018

important-current-affairs-in-telugu-02-06-december-2018.telugumaterial.in


Q1. మహాపరినిర్వాన్ దివస్ (డాక్టర్ అంబేద్కర్ మరణ వార్షికం) ఎప్పుడు జరుపుకుంటారు?
a) ఏప్రిల్ 14
b) డిసెంబర్ 06
c) ఆగష్టు 14
d) జనవరి 26




Q2. ప్రపంచ నేల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
a) సెప్టెంబర్ 15
b) ఫిబ్రవరి 02
c) మార్చి 22
d) డిసెంబర్ 05




Q3. ఆర్థిక మరియు సాంఘిక అభివృద్ధికి అంతర్జాతీయ స్వచ్చంద దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
a) సెప్టెంబర్ 15
b) ఫిబ్రవరి 02
c) మార్చి 22
d) డిసెంబర్ 05




Q4. ఇండియన్ నేవీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
a) నవంబర్ 30
b) ఫిబ్రవరి 02
c) డిసెంబర్ 04
d) డిసెంబర్ 05




Q5. వైకల్యాలున్న వ్యక్తుల అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
a) నవంబర్ 30
b) డిసెంబర్ 03
c) డిసెంబర్ 04
d) డిసెంబర్ 05




Q6. భోపాల్ విష వాయువు విషాదం జరిగిన రోజు?
a) డిసెంబర్ 01
b) డిసెంబర్ 03
c) డిసెంబర్ 04
d) డిసెంబర్ 05




Q7. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
a) డిసెంబర్ 01
b) డిసెంబర్ 02
c) డిసెంబర్ 03
d) డిసెంబర్ 04




Q8. ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
a) డిసెంబర్ 01
b) డిసెంబర్ 02
c) డిసెంబర్ 03
d) డిసెంబర్ 04




Q9. అంతర్జాతీయ బానిసత్వ వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
a) డిసెంబర్ 01
b) డిసెంబర్ 02
c) డిసెంబర్ 03
d) డిసెంబర్ 04




Q10. 2021-25 కాలానికిగాను వాతావరణ పరిరక్షణ చర్యల (Climate Action Investment ) గురించి ఎంత మొత్తాన్ని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది?
a) 100 బిలియన్ డాలర్లు
b) 200 బిలియన్ డాలర్లు
c) 300 బిలియన్ డాలర్లు
d) 400 బిలియన్ డాలర్లు




Q11. 2018-19లో 2వ త్రైమాసికంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం వృద్ధి చెందింది?
a) 6.7శాతం
b) 6.9 శాతం
c) 7.1 శాతం
d) 7.2 శాతం




Q12. ఇటీవల భారత్ ఏదేశంతో ‘కరెన్సీ స్వాప్’ ఒప్పందంపై సంతకం చేసింది?
a) ఖతార్
b) యూఏఈ
c) సౌదీ అరేబియా
d) రష్యా




Q13. ఇటీవల అమెరికా, 1987 ఇంటర్మీడియట్-రేంజ్ న్యూక్లిక్ ఫోర్సెస్ (INF) ఒప్పందంకు అనుగుణంగా తమ దగ్గర ఉన్న మిస్సైల్స్‌ని ధ్వంసం చేయాలని 60 రోజుల గడువును ఏ దేశానికి ఇచ్చింది?
a) రష్యా
b) ఉత్తర కొరియా
c) దక్షిణ కొరియా
d) చైనా




Q14. 2018 బాలన్ డి'ఓర్ అవార్డు సాధించిన ఫుట్‌బాల్ ఆటగాడు లుకా మాడ్రిక్ ఏ దేశ జాతీయ ఫుట్‌బాల్ జట్టు తరపున ఆడాడు?
a) ఫ్రాన్స్
b) క్రొయేషియా
c) పోర్చుగల్
d) అర్జెంటీనా




Q15. 27 సంవత్సరాల తర్వాత తొలిసారి తన శాశ్వత దౌత్య కార్యక్రమాలను అమెరికా తిరిగి ఏ దేశంలో స్థాపించింది?
a) సోమాలియా
b) మాలి
c) సూడాన్
d) కాంగో




Q16. ఎలుగుబంట్ల సంరక్షణ కొరకు అంతర్జాతీయ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు?
a) ఆగ్రా
b) న్యూఢిల్లీ
c) కోల్‌కతా
d) సిమ్లా




Q17. 2019 జనవరిలో పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (OPEC) నుండి వైదొలగాలని నిర్ణయించిన దేశం ఏది?
a) ఖతార్
b) ఇండోనేషియా
c) ఇరాన్
d) ఇజ్రాయెల్




Q18. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP24) సదస్సు 24వ సమావేశంలో భారతదేశం ఎవరు ప్రాతినిధ్యం వహించారు?
a) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
b) రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
c) పర్యావరణ మంత్రి హర్ష్ వర్ధన్
d) ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు




Q19. 'అనాథల అక్రమ రవాణా'ను ఆధునిక బానిసత్వం యొక్క నూతన రూపంగా గుర్తించిన మొట్టమొదటి దేశం ఏది?
a) కెనడా
b) స్పెయిన్
c) ఆస్ట్రేలియా
d) జపాన్




Q20. ఇటీవల ఏ నాయకుడి/నాయకురాలి ‘ఫ్రీడమ్ ఆఫ్ ప్యారిస్’ అవార్డును ఉపసంహరించుకున్నారు?
a) అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
b) మాల్దీవులు అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్
c) సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్
d) మయన్మార్ నేత ఆంగ్ శాన్ సూ కీ




Q21. భారతదేశం యొక్క భారీ ఉపగ్రహం GSAT 11 ఇస్రోచే ఇటీవల విజయవంతంగా ప్రయోగించింది. GSAT 11 ఏ వర్గం ఉపగ్రహాలకి చెందినది?
a) కమ్యూనికేషన్ ఉపగ్రహం
b) రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం
c) భూమి పరిశీలన ఉపగ్రహాలు
d) నావిగేషన్ సిస్టమ్ ఉపగ్రహాలు




Q22. భారతదేశం యొక్క మొట్టమొదటి ఇంజన్ రహిత రైలు పేరు ఏమిటి?
a) ట్రెయిన్ 18
b) ఫాస్ట్ ట్రాక్ 18
c) క్విక్స్ 18
d) బుల్లెట్ 18




Q23. ఏ దేశం ‘థియేటర్ లెవల్ ఆపరేషనల్ రెడీనెస్ ఎక్ససైజ్’ (TROPEX) సముద్ర యుద్ధ విన్యాసాలను నిర్వహిస్తుంది?
a) ఇండోనేషియా
b) మలేషియా
c) భారతదేశం
d) సింగపూర్




Answers & Explanations:




1. (b): భారత రాజ్యాంగ నిర్మాత డా. బీంరావ్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6న మరణించారు. ఈ దినాన్ని ఏటా మహాపరినిర్వాన్ దివస్‌గా జరుపుకుంటారు.




2. (d): ప్రపంచ నేల/ మట్టి దినాన్ని ఏటా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఆరోగ్యకరమైన నేల యొక్క ప్రాముఖ్యతను మరియు మట్టిలో లభించే వనరుల నిరంతర నిర్వహణ చర్యల అవగాహన పెంపొందించటానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది.




3. (d)




4. (c): దేశవ్యాప్తంగా డిసెంబర్ 4న 47వ భారత నావికా దినోత్సవాన్ని జరుపుకున్నారు. మన దేశంలో నౌకా దళం యొక్క పాత్రను మరియు విజయాలను గుర్తుచేసుకోవటానికి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు.




5. (b)




6. (b): మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యూసిఐఎల్) పురుగుమందుల ప్లాంట్‌లో 1984 డిసెంబరు 2-3న రాత్రి గ్యాస్ లీక్ దుర్ఘటన జరిగింది. ఇది ప్రపంచంలో అతి విషాదకరమైన ‘పారిశ్రామిక విపత్తు’గా పరిగణించబడుతుంది. మీథైల్ ఐసోసైనేట్ (MIC) అనే విషవాయువు వెలువడి సుమారు 5లక్షల మంది ప్రభావితమైనట్లు మరియు 8వేల మంది ఈ దుర్ఘటన జరిగిన రెండు వారాలలో చనిపోయినట్లు మరో 8వేల మంది ఈ ఘటన దుష్ప్రభావాల కారణంగా చనిపోయినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి.




7. (b)




8. (b)




9. (b)




10. (b): ప్రస్తుత ఐదు సంవత్సరాల కాలానికి అందిస్తున్న నిధులను రెట్టింపుచేస్తూ 2021-2025 కాలానికి ప్రపంచ బ్యాంకు 200 బిలియన్ డాలర్లను వాతావరణ పరిరక్షణ చర్యలకు పెట్టుబడులను ప్రకటించింది.




11. (c): నవంబరు 30న సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (CSO) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2018-19 రెండవ త్రైమాసికంలో భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి 7.1 శాతం పెరిగింది.




12. (b): ఇటీవల అబుదాబిలో 12వ ఇండియా-యూఏఈ జాయింట్ కమిషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇండియా-యూఏఈలు రెండు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అందులో కరెన్సీ స్వాప్ ఒకటి. కరెన్సీ మార్పిడి ఒప్పందం ఇరుదేశాలకు వారివారి సొంత కరెన్సీలో వ్యాపారాన్ని చేసుకునేందుకు వీలు కలుగుతుంది.




13. (a): రష్యా 60 రోజుల్లో తమ దగ్గరున్న క్షిపణులను కూల్చివేయనట్లయితే మిడ్-రేంజ్ అణు ఆయుధాలను పరిమితం చేసే ఒక పెద్ద ప్రచ్ఛన్న యుద్ధ ఒప్పందం నుండి ఉపసంహరించుకుంటామని యునైటెడ్ స్టేట్స్ రష్యాను హెచ్చరించింది.




14. (b): క్రొయేషియా కెప్టెన్ మరియు మిడ్‌ఫీల్డర్ లూకా మాడ్రిక్ 2018 బాలన్ డి'ఓర్ అవార్డును గెలుచుకున్నాడు.




15. (a): యునైటెడ్ స్టేట్స్ 27 సంవత్సరాల తర్వాత సోమాలియాలో మొట్టమొదటిసారిగా తన శాశ్వత దౌత్య కార్యక్రమాలను తిరిగి ఏర్పాటు చేసింది. సోమాలియాకు సంబంధించిన దౌత్య కార్యక్రమాలను 2013 నుండి సోమాలియా పొరుగుదేశమైన కెన్యా నుండి అమెరికా దౌత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. ఇప్పుడు నేరుగా సోమాలియాలో తన శాశ్వత దౌత్య కార్యక్రమాలను తిరిగి ఏర్పాటు చేసింది.




16. (a): ఎలుగుబంట్ల సంరక్షణ కొరకు ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రాలో నాలుగు రోజులపాటు అంతర్జాతీయ సమావేశం జరిగింది. జంతుప్రదర్శనశాలలు, రెస్క్యూ కేంద్రాలలో ఎలుగుబంట్లు మరియు ఇతర జంతువుల సంక్షేమ సూత్రాలపై అవగాహన పంచుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 11 దేశాల నుండి 80 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.




17. (a): 2019 జనవరిలో పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (OPEC) నుండి వైదొలగాలని నిర్ణయించినట్లు డిసెంబర్ 3న ఖతార్ ఇంధన శాఖ మంత్రి సాద్ షెరిదా అల్ కబీ ప్రకటించారు.





18. (c): కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP24) సదస్సు లేదా పర్యావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ముసాయిదా సదస్సు (UNFCCC) 24వ సమావేశం డిసెంబర్ 2న పోలండ్‌లోని కటోవిస్‌లో ప్రారంభమయింది. డిసెంబర్ 14వరకు ఈ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ భారతీయ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ సదస్సు ఆచరణాత్మక మార్గదర్శకాలను మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుంటుందని భారత్ ఆశాభావం వ్యక్తం చేసింది..




19. (c): 'అనాథల అక్రమ రవాణా'ను ఆధునిక బానిసత్వం యొక్క నూతన రూపంగా ఆస్ట్రేలియా గుర్తించింది. అనాథలను బానిసత్వంలోకి లాగడానికి అక్రమ పద్ధతులలో అనాథాశ్రయాలకు తరలించటాన్ని నేరంగా పరిగణించే చట్టాన్ని రూపొందించింది.




20. (d): మయన్మార్ యొక్క రోహింగ్య మైనారిటీపై అణిచివేతకు విరుద్ధంగా మాట్లాడటంలో నోబెల్ శాంతి గ్రహీత మరియు నోబెల్ శాంతి గ్రహీత మరియు మయన్మార్ నేత ఆంగ్ శాన్ సూ కీ కి బహూకరించిన ‘ఫ్రీడమ్ ఆఫ్ పారిస్’ పురస్కారాన్ని తొలగించారు.




21. (a): "బిగ్ బర్డ్" అని పిలువబడే భారతదేశం యొక్క భారీ మరియు అత్యంత అధునాతన సమాచార ఉపగ్రహం GSAT-11ను 2018 డిసెంబర్ 5 న దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానాలోని స్పేస్‌పోర్ట్ నుండి అంతరిక్షంలోకి ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. కేబుల్-ఆధారిత ఇంటర్నెట్ చేరుకోలేని రిమోట్ ప్రదేశాలకు ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్‌ను ఈ ఉపగ్రహం అందిస్తుంది.




22. (a): భారతదేశం యొక్క మొట్టమొదటి ఇంజన్ రహిత (లోకోమోటివ్-లేని) రైలు ‘ట్రెయిన్ 18’ ని కోటా-సవై మాధోపూర్ సెక్షన్లో పరీక్షించారు. ఈ టెస్ట్ రన్‌లో ఈ రైలు 180 kmph వేగ పరిమితిని దాటింది. మరికొన్ని పరీక్షలు పూర్తిచేసుకుని 2019 జనవరి నుంచి వినియోగానికి అందుబాటులోకి రానుంది.




23. (c): భారత నావికాదళం జనవరి 2019 నుండి మార్చి 2019 వరకు ‘థియేటర్ లెవల్ ఆపరేషనల్ రెడీనెస్ ఎక్ససైజ్’ (TROPEX) సముద్ర యుద్ధ విన్యాసాలను నిర్వహిస్తుంది. ఈ విన్యాసాలు భారత కోస్ట్ గార్డ్స్ (ICG), ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) మరియు ఇండియన్ నేవీ ల యొక్క పోరాట సామర్ధ్యాన్ని పరీక్షించే అవకాశాన్ని కల్పిస్తాయి.

No comments