డెయిలీ క్విజ్ 45: ఎకానమీ
Q1. స్వాతంత్ర్యం సాధించిన తరవాత భారత ప్రభుత్వం జాతీయాదాయ అంచనాలను అధికారికంగా సంకలనం చేయడానికి 1949 లో ‘జాతీయాదాయ కమిటీ’ ని స్ధాపించింది. ఆ కమిటీలో సభ్యులు ఎవరు?
A: డాక్టర్ బి. ఆర్.అంబేద్కర్
B: ఆచార్య ఆర్. సి. దత్త
C: ఆచార్య పి. సి. మహలనోబిస్
D: ఆచర్య డి. ఆర్.గాడ్గిల్
E: ఆచార్య సుఖమోయ్ చక్రవర్తి
F: ఆచార్య వి. కె. ఆర్. వి. రావు
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) C, D మరియు F మాత్రమే
b) A, E మరియు F మాత్రమే
c) B, D మరియుE మాత్రమే
d) A, B మరియు C మాత్రమే
Q2. కింది జతలను పరిశీలించండి:
వ్యవసాయ యోగ్యమైన కమాండ్ ప్రాంతం ప్రాజెక్టు/పధకం
A: 10,000 హెక్టార్లకు మించి సాగు చేయగలభూమి - మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు
B: 10,000 నుండి 25,000 ఎకరాల వరకు సాగు చేయగల భూమి - మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు
C: 10,000 ఎకరాల వరకు సాగు చేయగల భూమి - మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు
సరియైన కాని జతలను ఎంపిక చేయండి:
a) A మరియు C మాత్రమే
b) A మాత్రమే
c) B మాత్రమే
d) B మరియు C మాత్రమే
Q3. కింది వాటిలో దేని గురించి జాతీయ ఆహార భద్రత చట్టం 2013 వివరిస్తుంది?
A: ఆహార మరియు పోషక భద్రత.
B: సరిపోయిన పరిమాణంలో ఆహారం పొందుటకు ఉచిత అవకాశం.
C: సరిపోయిన పరిమాణంలో ఆహారం పొందుటకు ధరలు అందుబాటులో ఉండటం.
D: మహిళలు మరియు పిల్లలకు పోషక ఆహారాన్ని అందించడం.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) B, C మరియు D మాత్రమే
b) A, B మరియు C మాత్రమే
c) A, B మరియు D మాత్రమే
d) A, C మరియు D మాత్రమే
Q4. ఆగస్టు 2005లో నియమించబడ్డ రెండవ పరిపాలనా సంస్కరణల కమిషన్ యొక్క చైర్‌పర్సన్ ఎవరు?
a) వీర్ప మెయిలీ
b) జస్టిస్ కుల్‌దీప్ సింగ్
c) జస్టిస్ జె. ఎస్. వర్మ
d) దినేష్ గోస్వామి
Q5. భారతమాల ప్రయోజన ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది?
A: కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే రోడ్డు మరియు రహదారుల ప్రాజెక్టు
B: ఇది రాజస్ధాన్ మరియు గుజరాత్‌ను అరుణాచల్ ప్రదేశ్ మరియు మిజోరాంను కలుపుతుంది.
C: ఇది జమ్మూ కాశ్మీర్‌ను కేరళతో కలుపుతుంది.
D: ఇది ప్రస్తుతం ఉన్న అన్ని జాతీయ రహదారులను అంర్లీనం చేసుకుంటుంది.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A, B మరియు D మత్రమే
b) A, C మరియు D మాత్రమే
c) A, B మరియు C మాత్రమే
d) B, C మరియు D మాత్రమే
Q6. కింది వాటిలో ఏ స్కీంలు జన్ సురక్షా యోజనలోకి వస్తాయి?
A: ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన
B: ప్రధాన మంత్రి సురక్షా భీమా యోజన
C: ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన
D: అటల్ పెన్షన్ యోజన
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A, B, C మరియు D
b) A, B మరియుC మాత్రమే
c) B, C మరియు D మాత్రమే
d) A, C మరియు D మాత్రమే
Q7. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన గురించి కింద ఇవ్వబడిన వ్యాఖ్యలను పరిశీలించండి:
A: ప్రమాదానికి గురయ్యి లేదా మొత్తం వైకల్యం అయితే స్కీం యొక్క రిస్క్ పరిమితి రెండు లక్షల రూపాయలు.
B: పాక్షిక వైకల్యం అయితే ఒక లక్ష రూపాయలు.
C: 18-70 సంవత్సరం వయస్సు మధ్యగల వ్యక్తులు ఈ స్కీం వల్ల లబ్ది పొందుటకు అర్హులు.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) B మరియు C మాత్రమే
b) A, B మరియు C
c) A మాత్రమే
d) A మరియు B మాత్రమే
Q8. ‘పెద్ద కరువు’, లేక ‘ధాత కరువు’ గా పేరుగాంచి, భారతదేశంలో బ్రిటీష్ పాలనారంభం నుండి అతి భయంకర క్షామంగా పేరుగాంచింది. ఏ సంవత్సరంలో సంభవించింది?
a) 1876-78
b) 1770
c) 1790
d) 1868-69
Q9. 2014-16 కాలంలో కింది రాష్ట్రాలను వాటి ప్రసూతి మరణాల రేటుతో జతపరచండి :
రాష్ట్రం
a: కేరళ
b: అస్సాం
c: మహారాష్ట్ర
d: రాజస్ధాన్
ప్రసూతి మరణాల రేటు
i: 237
ii: 199
iii: 66
iv; 61
v: 46
సరియైన జవాబును/జతలను ఎంపిక చేయండి :
a) a-v, b-ii, c-iii, d-i
b) a-v, b-i, c-iv, d-ii
c) a-iv, b-iii, c-i, d-ii
d) a-iii, b-ii, c-iv, d-i
10. భారత ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని యిచ్చే వనరు ఏది ?
a) రైల్వేలు
b) అమ్మకం పన్ను
c) ఎక్సైజ్ ద్యూటీ
d) ఇన్ కమ్ టాక్స్
Answers:
1. జవాబు: a
2. జవాబు: b
3. జవాబు: d
4. జవాబు: a
5. జవాబు: a
6. జవాబు: c
7. జవాబు: b
8. జవాబు: a
9. జవాబు: b
10. జవాబు: d

No comments