డెయిలీ క్విజ్ 47: కరెంట్ అఫైర్స్ & జీకే
Q1. కింద జతలను పరిశీలించండి :
రచయిత పుస్తకం పేరు (ఆంగ్లంలో)
a: సౌరవ్ గంగూలి - ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్
b: శశి ధరూర్ - ఏస్టేట్ ఆఫ్ ఫ్రీడం
c: సంజయ్ బరు - ద ఆక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ : ద మేకింగ్.........
d: ఆమర్త్య సేన్ - ద ఐడియా ఆఫ్ జస్టిస్
సరియైన జవాబును / జతలను ఎంపిక చేయండి :
a) a, b మరియు c మాత్రమే
b) b, c మరియు d మాత్రమే
c) a, c మరియు d మాత్రమే
d) a, b మరియు d మాత్రమే
Q2. 2018 వింబుల్డన్ (మహిళల సింగిల్స్) టెన్సిస్ టోర్నమెంట్‌పై కింది వివరణలను (అంశాలను) పరిశీలించండి :
a: 2018 మహిళల సింగిల్స్ వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ ను ఏంజలిక్ కెర్బర్ గెలుచుకుంది.
b: 36 సంవత్సరాల సెరెనా విలియమ్స్ ను 6 – 4, 6- 3, తేడాతో కెర్బర్ ఓడించింది.
c: 2018 వింబుల్డన్ మహిళా విజేత, 30 సంవత్సారాల జర్మన్ అయిన కెర్బర్ ఈ టోర్నమెంట్ ఆరంభంలో 11వ సీడ్‌గా ఉండింది.
d: ఇది ఆమెకు మొటమొదటి వింబుల్డన్ టైటిల్ మరియు 2016 లో సాధించిన ఆస్ట్రేలియా ఓపెన్, యు. ఎస్. ఓపెన్ తో కలుపుకొంటే మూడవ గ్రాండ్ స్లామ్ అవుతుంది.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) a, b మరియు మాత్రమే
b) a మరియు d మాత్రమే
c) a, c మరియు d మాత్రమే
d) b, c మరియు d మాత్రమే
Q3. ‘భారత సైన్స్ కాంగ్రెస్’ కు సంబంధించిన కింది అంశాలను పరిశీలించండి :
a: భారత సైన్స్ కాంగ్రెస్ యొక్క 104వ సెషన్ మణిపూర్ విశ్వవిద్యాలయంలో జరిగింది.
b: ‘అంతవరకు చేరని ప్రజలకు / ప్రాంతాలకు సైన్స్ మరియు టెక్నాలజీ ద్వారా చేరడం’ అనే నేపధ్యం (ధీం) తో భారత సైన్స్ కాంగ్రెస్, 2018 సమావేశాలు జరిగాయి.
c: భారత సైన్స్ కాంగ్రెస్, 2018 సెషన్ మార్చ్ 16 – 20, 2018 కాలంలో జరిగింది.
సరియైన జవాబును ఎంపిక చేయండి :
a) a మరియు b మాత్రమే
b) b మరియు c మాత్రమే
c) a మరియు c మాత్రమే
d) a, b మరియు c
Q4. ‘గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2018’లో 180 దేశాలలో భారతదేశపు ర్యాంకు 177 గా గుర్తించారు. దీనికి సంబంధించిన సరియైన వివరణలను గుర్తించండి :
a: ఈ సూచీని ‘డౌన్ టు ఎర్త్’ మ్యాగజీన్ () విడుదల చేసింది.
b: దీనిని ‘స్టేట్ ఆఫ్ ఇండియా’స్ ఎన్విరాన్‌మెంట్’ 2018 సంకలనం చేసింది.
c: ‘స్టేట్ ఆఫ్ ఇండియా’స్ ఎన్విరాన్‌మెంట్’ అనేక అంశాలను, గాలి కాలుష్యం నుండి పర్యావరణ క్రైమ్ వరకు భిన్న అంశాలను పరిశీలిస్తుంది.
d: ఈ సూచీలో మొదటి అయిదు స్ధానాల్లో అంటే గ్రీన్ ర్యాంకింగ్ పొందిన దేశాలు ఏవంటే స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, డెన్‌మార్క్, మాల్టా, స్వీడన్.
సరియైన జవాబును ఎంపిక చేయండి :
a) a, b, c, d
b) a, b, c
c) b, c, d
d) a, d
Q5. కింది వాటిని జతపరచండి:
సంస్ధ / కౌన్సిల్ / కమిషన్
a: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫేర్స్ కు డైరెక్టర్ జనరల్
b: నాల్కోచైర్మన్ – కమ్ – మేనెజింగ్ డైరెక్టర్
c: పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు చైర్మన్
d: నేషనల్ కమిషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కు చైర్మన్
అధికారి పేరు
i: విశ్వాస్ పటేల్
ii: తపన్ కుమార్ చంద్
iii: టి. సి. ఎ. రాఘువన్
iv: శ్రీమంత్ పాండే
v: స్తుతి నారాయణ్ కక్కర్
సరియైన జతలను / జవాబును ఎంపిక చేయండి :
a) a – iii, b – ii, c – I, d - v
b) a – v, b – ii, c – iv, d - iii
c) a – iv, b – iii, c – I, d - ii
d) a – ii, b – I, c – iii, d - v
Q6. పారా- అధ్లెటిక్స్ గేమ్స్ గురించిన కింది అంశాలను పరిశీలించండి :
a: 2018 లో దుబాయిలో జరిగిన ప్రపంచ పారా – అధ్లెటిక్స్ గ్రాండ్ పిక్స్ ఆటలో F 53 / 54 కేటగిరీ జావెలిన్ ఈవెంట్‌లో దీపా మాలిక్ స్వర్ణ పతకాన్ని సాధించింది.
b: ఈ విజయంతో దీపా మాలిక్ F – 53 జావెలిన్ విభాగంలో ప్రపంచ నంబర్ వన్ (1) ర్యాంకును సాధించింది.
c: 2018 ఆసియన్ పారా – గేమ్స్ అక్టోబర్ 2018 లో భారతదేశంలో జరుగుతాయి.
సరియైన జవాబును ఎంపిక చేయండి :
a) b మరియు c మాత్రమే
b) a మరియు c మాత్రమే
c) a మాత్రమే
d) b మాత్రమే
Q7. కింది అంశాలను పరిశీలించండి :
a: జమ్మూ – కాశ్మీర్ లో గవర్నర్ పాలనను2018 జూన్ మూడవ వారంలో విధించారు.
b: జమ్మూ – కాశ్మీర్ గవర్నర్ గా B. V. R. సుబ్రమణ్యం నియమించబడ్డాడు.
c: జమ్మూ – కాశ్మీర్ రాష్ట్రానికి S. P. వైద్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా ఉన్నారు.
సరియైన జవాబును ఎంపిక చేయండి :
a) a మరియు b మాత్రమే
b) b మరియు c మాత్రమే
c) a మరియు c మాత్రమే
d) a, b మరియు c
Q8. గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వంచే ప్రకటించబడిన స్వచ్ఛ్ సర్వేక్షణ్ 2018 ర్యాంకింగ్స్ లో గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ మరియు కరీంనగర్ నగరాలకు (ఒక లక్ష జనాభా మించిన నగరాల విభాగంలో) ఏ ర్యాంకింగులు వచ్చాయి?
a) వరుసగా 22, 49 మరియు 76
b) వరుసగా 27, 31 మరియు 73
c) వరుసగా 38, 47 మరియు 85
d) వరుసగా 27, 38 మరియు 77
Q9. జూన్ 2018, లో కేంద్ర మంత్రిమండలి ఓ. బి. సి. సబ్ – కాటగరైజేషన్ కు సంబంధించి ఏర్పాటు చేసిన కమిషన్ (సంస్ధ) యొక్క కాలపరిమితిని చివరిసారి పొడిగింపును అనుమతించింది. దీనికి సంబంధించిన సరిగాని సమాధానంను గుర్తించండి :
a: ఈ కమిషన్ జి. రోహిణి ఆధ్వర్యంలో నున్నది.
b: ఈ కమిషన్ కాలపరిమితిని 31 జూలై, 2018 వరకు పొడిగించారు.
c: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్340 కింద ఈ కమిషన్ వ్యవస్ధీకరించబడింది.
d: ఈ కమిషన్ తన రిపోర్టును మే 20, 2018న ఇవ్వవలసి ఉండింది.
సరియైన జవాబును ఎంపిక చేయండి :
a) a, b, c, d
b) a, b, c మాత్రమే
c) a, b మాత్రమే
d) d మాత్రమే
Q10. చట్టంనకు అనుగుణంగా ప్రధాన న్యాయస్ధానం జూన్ 5, 2018 తేదీన పదోన్నతుల విషయంలో కూడ ఎస్. సి. /ఎస్. టి. రిజర్వేషన్ విధానాన్ని అమలుచేయడానికి అనుమతించింది. కింది విషయాలలో ఏది/ఏవి ప్రధాన న్యాయస్ధానం ఈ తీర్పులో చేర్చలేదు?
a: ప్రభుత్వ విధానం చట్టరీత్యా వుండాలి.
b: ఈ తీర్పు ప్రకారం పరిమాణాత్మక దత్తాంశం (డాటా) ఆధారంగా రాష్ట్రం తగిన నిర్ణయం తీసుకోవాలి.
c: వెనుకబాటుతనం, మొత్తం సామార్ధ్యం వంటి దత్తాంశం (డాటా) ఆధారంగా రిజర్వేషన్లను చూడరాదని తెలియజేసింది
d: భారత రాజ్యాంగపు ఆర్టికల్ 16 ను తప్పనిసరిగా అనుసరించాలి.
సరియైన జవాబును ఎంపిక చేయండి :
a) a, b, c మాత్రమే
b) b, c, d మాత్రమే
c) c మాత్రమే
d) b, d మాత్రమే
Q11. జూలై 12, 2018 నాడు స్వర్గస్తులైన ఆచార్య N. N. విగ్ గురించి కింది వివరణలను (అంశాలను) పరిశీలించండి :
a: భారతదేశం యొక్క మొట్టమొదటి మానసిక నిపుణులలో ఆచార్య నరేంద్ర విగ్ ఒక ప్రధానమైన వ్యక్తి.
b: 1991 లో ‘రాయల్ కాలేజ్ ఆఫ్ సైకియాట్రిస్ట్స్’, లండన్ వారు ‘హానరరీ ఫెలోషిప్ ఆఫ్ ది కాలేజీ’ అత్యున్నత పురస్కారంతో అతన్ని గౌరవించింది.
c: ఈ పురస్కారంతో గౌరవించబడ్డ భారతీయుల్లో ఇతడు రెండవ సైకియాట్రిస్ట్.
d: ప్రపంచ ఆరోగ్య సంస్ధ ‘మానసిక ఆరోగ్యంపై సలహా మండలి’కి అతను చైర్మన్‌గా ఉండినాడు.
e: అతను పశ్చిమ పంజాబ్‌లోని గురుజన్వాలా జిల్లాలో జన్మించాడు.
సరియైన జవాబును ఎంపిక చేయండి :
a) a, b, c మరియు e మాత్రమే
b) a, d మరియు e మాత్రమే
c) a, b మరియు e మాత్రమే
d) b, c మరియు d మాత్రమే
Q12. కింది అంశాలను పరిశీలించండి :
a: ‘ప్రధాన మంత్రి క్రిషి సించాయి యోజన’ () కింద నాబార్డు () తో ‘మైక్రో ఇరిగేషన్ ఫండ్’ (సూక్ష్మ నీటి పారుదల నిధి) ఏర్పాటు కోసం భారత ప్రభుత్వం రూ. 5,00 కోట్ల కార్పస్‌ను ఆమోదించింది.
b: ప్రధాన మంత్రి క్రిషి సించాయి యోజనలో భాగమైన ‘ప్రతీ నీటి చుక్కకు ఎక్కువ పంట’ (పర్ డ్రాప్ మోర్ క్రాప్) కు బదులుగా ‘సూక్ష్మ నీటి పారుదల నిధి’ని ప్రవేశపెట్టారు.
సరియైన జవాబును ఎంపిక చేయండి :
a) a మరియు b రెండూ సరియైనవి.
b) a మరియు b రెండూ సరియైనవి కావు.
c) a మాత్రమే సరియైనది.
d) b మాత్రమే సరియైనది.
Q13. “నిజాయితీపరుడు, కాని బోల్ష్‌విక్ కావున ప్రమాదకరమైన వ్యక్తి” – గాంధిజీని గురించి ఈ క్రింది వారిలో ఎవరు వాఖ్యానించిరి?
a) లార్డ్ విల్లింగ్‌టన్
b) లార్డ్ ఇర్విన్
c) జనరల్ స్మట్స్
d) బెర్కినిహెడ్
Answers:
1. జవాబు: c
2. జవాబు: c
3. జవాబు: b
4. జవాబు: a
5. జవాబు: a
6. జవాబు: c
7. జవాబు: c
8. జవాబు: b
9. జవాబు: d
10. జవాబు: c
11. జవాబు: c
12. జవాబు: c
13. జవాబు: a

No comments