Breaking News

డెయిలీ క్విజ్ 48: తెలంగాణ ఎకానమీ

daily-quiz-in-telugu-telangana-economy-48-telugumaterial.in



Q1. బర్రెల పంపిణీ స్కీం గురించి ఈ కింది వ్యాఖ్యలను పరిశీలించండి:

A: ఈ స్కీం ‘పాడి రైతులకు బర్రెల పంపిణీ’ తెలంగాణ ప్రభుత్వం ఆమోదం పొంది 2018-19లో ఆచరణ చేయబడుతుంది.
B: అందరు లబ్దిదారులకు యూనిట్ ఖర్చుపైన 50 శాతం సబ్సిడీ ఇవ్వబడుతుంది.
C: సుమారు రెండు లక్షల కుటుంబాలు ఈ పధకం ద్వారా లబ్ది పొందుతారు.
D: రవాణా ఖర్చు రూ. 5000 కాకుండా ఒక్క బర్రె యూనిట్ ఖర్చు రూ. 60,000 కు మించకూడదు.




సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) B, C మరియు D మాత్రమే
b) A మరియు C మాత్రమే
c) B మరియు D మాత్రమే
d) A, B మరియు D మాత్రమే




Q2. కింద ఇవ్వబడిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్సిడీపై గొర్రెలు పెంచే కుటుంబాలకు గొర్రెల పంపిణీకి సంబంధించినవి:
A: జూన్ 2, 2017 నాడు ఈ స్కీంను ప్రారంభించారు.
B: ఈ పధకాన్ని కొండపాక గ్రామం, సిద్దిపేట జిల్లాలో ప్రారంభించారు.
C: ఈ స్కీంను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు.
D: గొర్రెలకు సంబంధించి ఆరోగ్యపరమైన సమస్యలకు టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 2017.
సరియైనవి కాని వ్యాఖ్యలను ఎంపిక చేయండి:
a) B, C మరియు D మాత్రమే
b) A మరియు C మాత్రమే
c) B మరియు D మాత్రమే
d) A మరియు D మాత్రమే




Q3. కింది వాటిని జతపరచండి:




పధకం/పాలసీ
A: TS-iPASS
B: షీ టీం
C: ఆరోగ్య లక్ష్మీ
D: హరితహారం
E: షాదీ ముబారక్




ప్రవేశ పెట్టిన/అమలుపరిచిన తేదీ
1: జనవరి 1, 2015
2: అక్టోబర్ 2, 2014
3: జూన్ 12, 2014
4: జూన్ 2, 2015
5: జులై 3, 2015
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి:
a) A-2, B-5, C-3, D-6, E-1
b) A-4, B-5, C-2, D-6, E-3
c) A-3, B-5, C-1, D-6, E-2
d) A-4, B-3, C-1, D-5, E-2




Q4. తెలంగాణ గ్రామ జ్యోతి స్కీం గురించి కింద ఇవ్వబడిన వ్యాఖ్యలను పరిశీలించండి:
A: ఆగస్టు 15, 2015 నాడు ఈ స్కీంను ప్రారంభించారు.
B: ఈ స్కీం గ్రామాల సాధికారతకు సంబంధించింది.
C: నిజామాబాద్ జిల్లా మోతె గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించాడు.
D: ప్రణాళికా రచన మరియు సామూహిక నిర్ణయాలలో ప్రజల భాగస్వామ్యంతో సమ్మిళిత మరియు సంపూర్ణమైన గ్రామ అభివృద్ది చేయడం ఈ స్కీం యొక్క ముఖ్య ఉద్దేశాలలో ఒకటి.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A, B మరియు D మాత్రమే
b) A మరియు C మాత్రమే
c) A, B మరియు C మాత్రమే
d) B, C మరియు D మాత్రమే




Q5. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కింది జతలను పరిశీలించండి:
A: టి-హెచ్‌ఎ‌ఆర్‌టి (T-HART) : తెలంగాణ తోటల పెంపకం, వ్యవసాయ పరిశోధన మరియు శిక్షణ.
B: టి-అసిస్ట్ (T-ASSIST) : చిన్నతరహా పరిశ్రమల నైపుణ్యాల టెక్నాలజీ వేగవంతం చేయటం.
C: టి-అసిస్ట్ (T-ASSIST) :తెలంగాణ అడ్వాన్స్‌‌డ్ సాలిడ్ స్టేట్ ఇల్యూమినేషన్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్.
D: రిచ్ (RICH) :హైదరాబాద్ పరిశోధన మరియు ఆవిష్కరణ సర్కిల్.
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి:
a) B మరియు D మాత్రమే
b) A, B మరియు D మాత్రమే
c) A, C మరియు D మాత్రమే
d) A మరియు C మాత్రమే




Q6. మిషన్ కాకతీయ గురించి కింద ఇవ్వబడిన వ్యాఖ్యలను పరిశీలించండి:
A: ఇది తెలంగాణ రాష్ట్రంలో చెరువుల పునరుద్దరణ పధకం.
B: సదాశివనగర్‌లో మార్చి 12, 2015 నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించాడు.
C: ఈ పధకం ద్వారా 46,531 చెరువులను 5 సంవత్సరాలలో పునరుద్దరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
D: దీనిని మన ఊరు-మన చెరువు అని కూడా పిలుస్తారు.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A మరియు D మాత్రమే
b) A, B, C మరియు D
c) A, C మరియు D మాత్రమే
d) B మరియు C మాత్రమే




Q7. కింది వాటిని జతపరచండి:
పుస్తకం
A: గాధే సప్తసధి
B: పండితారాధ్య చరిత్ర
C: బృహత్ కధ
D: యాది


రచయిత
1: గుణాడ్యుడు
2: హలుడు
3: సామల సదాశివ
4: పాల్కురికి సోమనాధుడు
5: పాల్కురికి శ్రీనాధుడు
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి:
a) A-5, B-1, C-2, D-3
b) A-2, B-5, C-3, D-1
c) A-2, B-4, C-1, D-3
d) A-4, B-3, C-1, D-2




Q8. కింది వివరణలను పరిశీలించండి:
A: వెనుకబడిన కులాలకు 100 శాతం ఉత్పాదక సబ్సిడీ పధకాన్ని ప్రారంభించాలని తెలంగణ ప్రభుత్వం నిర్ణయించింది.
B: ప్రభుత్వ బిసిలకు రూ. 2 లక్షల వరకు పెట్టుబడి మద్దతును అందిస్తుంది.
C: వెనుకబడిన తరగతులలో సుమారు 70 కులాలలో నైపుణ్యం గల ప్రజలకు పెట్టుబడి మద్దతుకు ఇది ఉద్దేశించబడింది.
D: మంగలి, కమ్మరి, కంసాలి, కుమ్మరి, బేల్దారి (సుతారి), చిన్న వ్యాపారస్దులు ఈ పధకం ద్వారా లాభం పొందుతారు.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A, B మరియు D మాత్రమే
b) A మరియు B మాత్రమే
c) C మరియు D మాత్రమే
d) A మరియు D మాత్రమే




Q9. కింది వాటిని జతపరచండి:
తెలంగాణ మాండలిక పదాలు
A: ఇగం
B: తపుకు
C: కుందెన
D: గుత్ప

వాటి అర్ధాలు
1: ధన్యం దంచేటప్పుడు రోటిపై ఉపయోగించే లోహపు పరికరం
2: గట్టి కర్ర
3: లోహపు ప్లేటు
4: చలి/చల్లని
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి:
a) A-4, B-3, C-1, D-2
b) A-4, B-1, C-3, D-2
c) A-2, B-3, C-4, D-1
d) A-1, B-3, C-2, D-4




Q10. కింది వాటిని జతపరచండి :
కేంద్ర ప్రభుత్వ పధకం
a: నేషనల్ రుర్బన్ మిషన్
b: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన
c: ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన్
d: ప్రధాన మంత్రి కౌషల్ వికాస్ యోజన




ఆరంభించబడిన నెల, సం.
i: ఏప్రిల్ 2016
ii: ఫిబ్రవరి 2016
iii: జూలై 2015
iv: మే 2015
సరియైన జవాబును/ జతలను ఎంపిక చేయండి :
a) a-i, b-iii, c-iv, d-ii
b) a-iv, b-i, c-iii, d-ii
c) a-iii, b-ii, c-iv, d-i
d) a-ii, b-i, c-iv, d-iii




Answers:

1. జవాబు: d
2. జవాబు: d
3. జవాబు: c
4. జవాబు: a
5. జవాబు: a
6. జవాబు: b
7. జవాబు: c
8. జవాబు: a
9. జవాబు: a
10. జవాబు: d

No comments