ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్విజ్ 13-జనవరి-2019
Q1. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (NCAP) బేస్ సంవత్సరం ఏది?
a) 2015
b) 2017
c) 2019
d) 2020
Q2. 'వీ ఆర్ డిస్‌ప్లేస్‌డ్ : మై జర్నీ అండ్ స్టోరీస్ ఫ్రమ్ రెఫ్యూజీ గర్ల్స్ అరౌండ్ ద వరల్డ్’ పుస్తక రచయిత
a) నదియా నూరద్
b) మలాలా యూసఫ్ జాయి
c) ఖాలెదా హోసినీ
d) అరుంధతీ రాయ్
Q3. ఆరు నెలలపాటు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మరియు మెషీన్ లర్నింగ్ కోర్స్‌ని ప్రవేశపెట్టాలని నిర్ణయించిన సంస్థ ఏది?
a) IIT ఖరగ్‌పూర్
b) IIT మద్రాస్
c) IIT అలహాబాద్
d) IIT హైదరాబాద్
Q4. ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (AIBA) తాజాగా ‘లైట్ ఫ్లై’ (45-48 kg) విభాగంలో మొదటి ర్యాంకును ఎవరికి ప్రకటించింది?
a) ఒకోటా హానా
b) వాడా మడోక
c) మేరీ కోమ్
d) సిల్వా స్టెఫానీ
Q5. మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఒక "రిసెర్చ్ అడ్వయిజరీ" కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీకి ఎవరు నేతృత్వం వహించనున్నారు?
a) అజయ్ త్యాగి
b) శంకర్ డే
c) నారాయణ మూర్తి
d) నందన్ నీలేకని
Q6. ఫ్యూచర్ ఆఫ్ కన్సంప్షన్ ఇన్ ఫాస్ట్ గ్రోత్ కస్న్యూమర్ మార్కెట్ - ఇండియా’ (Future of consumption in fast-growth consumer market – India) నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది?
a) ప్రపంచ బ్యాంక్ (WB)
b) వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF)
c) IMF
d) OECD
Q7. ‘2019 హన్లీ అండ్ పార్ట్నర్స్ పాస్‌పోర్ట్ ఇండెక్స్’లో భారత స్థానం?
a) 61
b) 71
c) 79
d) 89
Q8. 2020 టోక్యో ఒలింపిక్స్ కొరకు భారత్‌లో ‘చీఫ్ ది మిషన్’గా ఎవరు నియమితులయ్యారు?
a) కిరణ్ చౌతాలా
b) రాజీవ్ మెహతా
c) సహదేవ్ యాదవ్
d) బీరేంద్ర ప్రసాద్ బైష్యా
Q9. తైవాన్ దేశ నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు?
a) షాయి-ఇంగ్-వెన్
b) షీ జింగ్ పింగ్
c) సూ షాంగ్-చాంగ్
d) జైబోల్సెనారో
Q10. రేణుకాజీ డ్యామ్ మల్టీపర్పస్ పాజెక్టును నిర్మించటానికి ఇటీవల 6 రాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ కింది వాటిలో ఆ రాష్ట్రాలను గుర్తించండి:
1: ఉత్తర ప్రదేశ్
2: హిమాచల్ ప్రదేశ్
3: హర్యాణా
4: డిల్లీ
5: రాజస్థాన్
6: ఉత్తరాఖండ్
a) 1, 2 మరియు 3 మాత్రమే
b) 2, 3 మరియు 4 మాత్రమే
c) 1, 2, 4, 5 మరియు 6 మాత్రమే
d) పైవన్నీ
Answers & Explanation:
1. b:2017 సంవత్సరంలో నమోదయిన డేటా ఆధారంగా వాయుకాలుష్యాన్ని నివారించేందుకు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (NCAP)ను రూపొందించారు. 5 సంవత్సరాల ప్రణాళికతో 2019 నుండి ఇది మొదలుకానుంది.
2. b:
3. a:వర్కింగ్ ప్రొఫెషనల్స్ మరియు ఇంజనీరింగ్ విద్యార్థుల కొరకు IIT ఖరగ్‌పూర్ ఆరు నెలలపాటు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మరియు మెషీన్ లర్నింగ్ కోర్స్‌ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
4. c: ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (AIBA) తాజార్యాంకింగ్స్‌లో 1700 పాయింట్లతో భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ అగ్రస్థానంలో నిలిచింది. 1100 పాయింట్లతో ఉక్రెయిన్‌కు చెందిన ఒకోటా హానా 2వ స్థానంలో నిలిచింది.
5. b: మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఒక "రిసెర్చ్ అడ్వయిజరీ" కమిటీని ఏర్పాటు చేసింది. ఇది మూలధనం యొక్క అభివృద్ధి మరియు క్రమబద్దీకరణకు సంబంధించిన పరిశోధనకు సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తుంది.
6. b: వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) ఫ్యూచర్ ఆఫ్ కన్సంప్షన్ ఇన్ ఫాస్ట్ గ్రోత్ కస్న్యూమర్ మార్కెట్ - ఇండియా’ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం భారత్ 2030 నాటికి 3వ అతిపెద్ద వినియోగదారుల (కస్న్యూమర్) మార్కెట్‌గా అవతరించనుంది. మొదటి స్థానంలో అమెరికా మరియు రెండవ స్థానంలో చైనా ఉండనున్నట్లు తెలిపింది.
7. c: ‘2019 హన్లీ అండ్ పార్ట్నర్స్ పాస్‌పోర్ట్ ఇండెక్స్’లో భారత 79వ స్థానంలో నిలిచింది. భారతీయ పాస్‌పోర్ట్‌తో ముందుగా వీసా (ప్రీ-ట్రావెల్ వీసా) అప్లై చేసుకోకుండా 61 దేశాలను ప్రయాణించవచ్చు. ఈ నివేదికలో జపాన్ మొదటి స్థానంలో నిలవగా సింగపూర్ 2వ స్థానంలో నిలిచాయి.
8. d: ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ (IWF) అధ్యక్షుడు బీరేంద్ర ప్రసాద్ బైష్యా 2020 టోక్యో ఒలింపిక్స్ కొరకు భారత్‌లో ‘చీఫ్ ది మిషన్’గా నియమితులయ్యారు. మొదటిసారిగా వెయిట్ లిఫ్టింగ్ క్రీడకు సంబంధించిన వారికి ఈ గుర్తింపు లభించింది. బైష్యా భారత ఒలింపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్లో కూడా ఒకరు.
9. c: తైవాన్ దేశ నూతన ప్రధానమంత్రిగా సూ షాంగ్-చాంగ్ నియమితులయ్యారు.
10. d: ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యాణా, డిల్లీ, రాజస్థాన్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలు యమునా నది మరియు దాని ఉపనదులయిన టోన్స్ మరియు గిరి నదులపై రేణుకాజీ డ్యామ్ మల్టీపర్పస్ పాజెక్టును నిర్మించటానికి ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కావలసిన వ్యయాన్ని కేంద్రం 90 శాతం భరిస్తుంది. మిగిలిన 10 శాతం సంబంధిత రాష్ట్రాలు భరిస్తాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా 3 డ్యాంలు నిర్మించనున్నారు. అవి 1. లక్వార్: యమునా నదిపై (ఉత్తరాఖండ్). 2-కిష్వా: టోన్స్ (ఉత్తరాఖండ్ & హిమాచల్ ప్రదేశ్). 3-రేణుకాజీ:గిరి (హిమాచల్ ప్రదేశ్).

No comments