Breaking News

డెయిలీ క్విజ్ 60: అరిథమెటిక్స్

daily-quiz-in-telugu-quantitative-aptitude-60-telugumaterial.in

Q1. ఒక బూట్ల జత కొన్నవెల రూ. 800, దాని ప్రకటిత వెల రూ. 1060. పండుగ విక్రయాలలో దుకాణదారునకు 12% నష్టం వస్తే, అతను ఇచ్చిన డిస్కౌంటు శాతం రమారమిగా
a) 36.2
b) 33.6
c) 32
d) 26




Q2. P ఒక వస్తువును Q కి 25% లాభంతో అమ్మెను. Q దానిని R కి 15% నష్టానికి అమ్మెను. R దానిని S కి 20% లాభానికి అమ్మెను. S దానిని రూ. 204 కి కొంటే, P ఆ వస్తువును కొన్నవెల (రూ.లలో)
a) 160
b) 175
c) 240
d) 310




Q3. ఒక వస్తువుపై రూ. 3 తగ్గించి, దానిని రూ. 42 కు అమ్మితే, దానిపై ఇచ్చిన డిస్కౌంట్ శాతం
a) 14
b) 9
c) 8 1/3
d) 6 2/3




Q4. ఒక దుకాణదారుడు ఒక వస్తువు యొక్క ప్రకటిత వెలపై 20% డిస్కౌంటును అనుమతించిన తరువాత, 12% లాభాన్ని పొందుతాడు. అయితే దాని కొన్నవెల కంటె, దాని ప్రకటితవెల ఎంత శాతం అధికం?
a) 40
b) 32
c) 25
d) 16




Q5. ఏక రూపవేగంతో ప్రయాణించే 180 మీటర్ల పొడవు గల ఒక రైలు బండి ఒక టెలిఫోన్ స్తంభాన్ని 18 సెకన్లలో దాటుతుంది. దానిలో కొన్ని పెట్టెలు తొలగించగా దాని పొడవు 150 మీటర్లకు కుదించబడింది. అదే వేగంతో ఈ రైలు బండి 120 మీటర్ల పొడవు గల వంతెనను దాటడానికి పట్టే సమయం (సెకనుల్లో)
a) 27
b) 25
c) 22
d) 15




Q6. 100 మీటర్ల పరుగు పందెంలో A, 10 మీటర్ల తేడాతో Bని, 28 మీటర్ల తేడాతో Cని ఓడిస్తే, Cని B ఎన్ని మీటర్ల తేడాతో ఓడిస్తాడు?
a) 18
b) 20
c) 24
d) 30




Q7. కొంతమంది పురుషులు ఒక పనిని 60 రోజులలో చేయగలరు. మరో 8 మంది పురుషులు వారితో కలిస్తే, ఆ పని 15 రోజులు ముందుగానే పూర్తి అవుతుంది. అయితే మొదట ఉన్న పురుషుల సంఖ్య ఎంత?
a) 24
b) 22
c) 20
d) 18




Q8. 12 మంది పురుషులు, 16 మంది స్త్రీలు ఒక పనిని 6 రోజులలో చేస్తారు మరియు 15 మంది పురుషులు, 30 మంది స్త్రీలు అదే పనిని 4 రోజులలో చేయగలరు. 6 గురు పురుషులు, 12 మంది స్త్రీలు అదే పనిని పూర్తి చేయడానికి పట్టు కాలము (దినములలో)
a) 14
b) 12
c) 10
d) 9




Q9. చందకు, ఒక పనిని చేయడానికి అవినాష్‌కి పట్టుకాలానికి రెండు రెట్ల సమయం మరియు సతీష్‌కి పట్టుకాలానికి మూడు రెట్ల సమయం కావాలి. చందు ఆ పనిని ప్రారంభించి, రెండు రోజుల తరువాత ఆ పని నుండి విరమించాడు. మిగిలిన పనిని అవినాష్ మరియు సతీష్‌లు కలిసి పూర్తి చేయడానికి పట్టుకాలము (గంటలలో)
a) 26 1/5
b) 24 1/2
c) 22 1/3
d) 19 1/5




Q10. మూడు సంఖ్యల మొత్తం 13680 అనుకుందాం. మొదటిసంఖ్య మూడవసంఖ్యలో 3/5వ వంతు మరియు రెండవ, మూడవ సంఖ్యల నిష్పత్తి 4 : 7 అయితే, మొదటి సంఖ్య
a) 3,600
b) 3,780
c) 4,280
d) 4,800




Answers:




1. జవాబు: b
2. జవాబు: a
3. జవాబు: d
4. జవాబు: a
5. జవాబు: a
6. జవాబు: b
7. జవాబు: a
8. జవాబు: c
9. జవాబు: d
10. జవాబు: b

No comments