డెయిలీ క్విజ్ 61: రీజనింగ్
1 మరియు 2 ప్రశ్నలకు సూచనలు : క్రింది సమాచారాన్ని జాగ్రత్తగా చదివి,82 మరియు 83 ప్రశ్నలకు సమాధానమివ్వండి.
క్రింది వర్గాలలో ఏ ఒక్క దానికైనా చెందిన వారికి, ఒక హెల్త్‌క్లబ్ (Health Club), దాని చందాలో 50 శాతాన్ని రాయితీగా ఇస్తుంది.
(i) అల్పాదాయవర్గానికి చెందిన వారి పిల్లలైయుండ్ 5మరియు 12 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు.
(ii) జాతీయ స్ధాయిలో ఆటలు, క్రీడలకు ప్రాతినిధ్యం వహించే, 25 సంవత్సరాల వయస్సు వరకూ గల స్త్రీలు.
(iii) 60 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులు.
(iv) వికలాంగులు (దివ్యాంగులు)
పైన ఉన్న వర్గాలలో దేనికీ చెందకపోయినా, అతడు/ఆమె సంవత్సరానికి ఒకసారి రక్తదానం చేస్తే, ఆ అభ్యర్ధిని కార్యదర్శి దృష్టికి తెస్తారు.
మీ సమాధానం:
Q1. 60 సంవత్సరాలు పూర్తి చేసుకోబోయే ఆంధొని, సంవత్సరానికి ఒకసారి రక్తదానం చేస్తాడు.
a) అభ్యర్ధి రాయితీకి అర్హుడే
b) అభ్యర్ధిని కార్యదర్శి దృష్టికి తెస్తారు
c) అభ్యర్ధి రాయితీకి అనర్హుడు
d) దత్తాంశం సరిపోదు
Q2. టేబుల్ టెన్నిస్ ఆటలో అనిత ఒక జాతీయ క్రీడాకారిణి.
a) అభ్యర్ధి రాయితీకి అర్హుడే
b) అభ్యర్ధిని కార్యదర్శి దృష్టికి తెస్తారు
c) అభ్యర్ధి రాయితీకి అనర్హుడు
d) దత్తాంశం సరిపోదు
క్రింది సమాచారాన్ని చదివి 3 మరియు 4 ప్రశ్నలకు సమాధానాలివ్వండి.
A, B, C, D, E, F, G , H అనే 8 మంది మిత్రులు, ఒక వృత్తాకార బల్లచుటూ దాని కేంద్రానికి అభిముఖంగా, ఈ క్రింది విధంగా కూర్చున్నారు.
(i) A ప్రక్కనే ఎడమవైపున H ఉన్నాడు, అయితే అతను D కు లేదా E కు పొరుగున లేడు
(ii) B ప్రక్కనే కుడివైపున F ఉన్నాడు మరియు E కు G పురుగువాడు
(iii) E మరియు F ల మధ్యలో C ఉన్నాడు
Q3. D యొక్క స్ధానం
a) B కు ప్రక్కనే ఎడమవైపున
b) F కు కుడివైపున రెండవది
c) A కు ప్రక్కనే ఎడమవైపున
d) B మరియు F ల మధ్య
Q4. ఈ క్రింది వానిలో ఏది సత్యము?
a) F మరియు B ల మధ్యలో E ఉన్నాడు
b) G యొక్క ఒక పురుగువాడు F
c) H మరియు E ల మధ్య G ఉన్నాడు
d) A మరియు D ల మధ్య H ఉన్నాడు
5 నుంచి 7 వరకు గల ప్రశ్నలలోని ప్రతి ప్రశ్నలోనూ, నిశ్చితత్వం (A) మరియు కారణం (R) అనే రెండు ప్రవచనాలను ఇచ్చారు. ఈ క్రింది ఇచ్చిన ఐచ్ఛికాలు (1), (2), (3), (4) లలో సరియైన దానిని ఎంపిక చేయండి.
మీ సమాధానం
Q5. నిశ్చితత్త్వం (A) : భారతదేశం ఉష్ణమండల రుతుపవన రకానికి చెందిన వాతావరణాన్ని కలిగి ఉంటుంది.
కారణం (R) : భారతదేశం ఉష్ణమండల అక్షాంశముల మధ్యలో ఖచ్చితంగా ఉంది
a) (A) మరియు (R) లు రెండూ సత్యము మరియు (A) యొక్క సరియైన వివరణ (R)
b) (A) మరియు (R) లు రెండూ సత్యము, కాని (A) యొక్క సరియైన వివరణ (R) కాదు
c) (A) సత్యము, కాని (R) అసత్యము
d) (A) అసత్యము, కాని (R) సత్యము
Q6. నిశ్చితత్త్వం (A) : తినే పదార్ధాలను ఎక్కువ సమయం నీటిలో నానబెట్టకూడదు
కారణం (R) : కడుగుట, తినుబండారముల నుండి విటమిన్ A మరియు విటమిన్ D ల యొక్క నష్టానికి దారితీస్తుంది.
a) (A) మరియు (R) లు రెండూ సత్యము మరియు (A) యొక్క సరియైన వివరణ (R)
b) (A) మరియు (R) లు రెండూ సత్యము, కాని (A) యొక్క సరియైన వివరణ (R) కాదు
c) (A) సత్యము, కాని (R) అసత్యము
d) (A) అసత్యము, కాని (R) సత్యము
Q7. నిశ్చితత్త్వం (A) : రక్తమునకు ఎరుపు రంగు హిమోగ్లోబిన్ వల్ల కలిగింది
కారణం (R): హిమోగ్లోబిన్ ఒక ఎర్రని వర్ణము (ఛాయ)
a) (A) మరియు (R) లు రెండూ సత్యము మరియు (A) యొక్క సరియైన వివరణ (R)
b) (A) మరియు (R) లు రెండూ సత్యము, కాని (A) యొక్క సరియైన వివరణ (R) కాదు
c) (A) సత్యము, కాని (R) అసత్యము
d) (A) అసత్యము, కాని (R) సత్యము
Q8. ఈ క్రింది ప్రశ్నలోని దత్త ఐచ్ఛికాలలో సరిపోలని దానిని కనుక్కొని, దానిని మీ సమాధానంగా రాయండి.
a) ఈగిల్
b) పికాక్
c) ఒస్ట్రిచ్
d) హాక్
Q9. ఈ క్రింది ప్రశ్నలోని దత్త ఐచ్ఛికాలలో సరిపోలని దానిని కనుక్కొని, దానిని మీ సమాధానంగా రాయండి.
a) సెప్టెంబరు
b) మే
c) జూన్
d) నవంబరు
Q10. ఈ క్రింది ప్రశ్నలోని దత్త ఐచ్ఛికాలలో సరిపోలని దానిని కనుక్కొని, దానిని మీ సమాధానంగా రాయండి.
a) EJO
b) HMR
c) DIN
d) LPT
Answers:
1. జవాబు: b
2. జవాబు: d
3. జవాబు: a
4. జవాబు: c
5. జవాబు: c
6. జవాబు: c
7. జవాబు: a
8. జవాబు: c
9. జవాబు: b
10. జవాబు: d

No comments