డెయిలీ క్విజ్ 62: బయాలజీ
Q1. జీవం పుట్టుకకు సంబంధించి సరైన ప్రకటనలను ఈ క్రింది వాటి నుండి ఎన్నుకొనుము:
I: నిర్జీవ సృష్టివాదం - అరిస్టాటిల్
II: పాన్‌స్పెర్మియో - అంతర నక్షత్ర ధూళి
III: ఒపారిన్-హాల్డేన్ - రసాయనిక పరిణామం
IV: నెబ్యులార్ పరికల్పన - హెల్మ్‌హాల్ట్జ్
a) I, IV
b) II, III
c) I, III
d) II, IV
Q2. సోదరేతర క్రొమాటిడ్ల మధ్య జన్యు పదార్ధం మార్పిడి చేసుకోవడం ఈ విభజనలో జరుగును మరియు ఈ దృగ్విషయాన్ని క్రింది రకంగా పిలుస్తారు.
a) క్షయకరణ విభజన మరియు సూత్రయుగ్మనం
b) సమవిభజన మరియు వినిమయం
c) క్షయకరణ విభజన మరియు వినిమయం
d) సమవిభజన మరియు సూత్రయుగ్మనం
Q3. క్రిందనివ్వబడిన వర్గీకరణ ప్రమాణాలను అధ్యయనం చేసి వాటిని ఆరోహణ క్రమంలో అమర్చుము
a) తరగతి, శ్రేణి, క్రమం, కుటుంబం, జాతి
b) జాతి, కుటుంబం, క్రమం, శ్రేణి, తరగతి
c) తరగతి, క్రమం, శ్రేణి, కుటుంబం, జాతి
d) జాతి, శ్రేణి, క్రమం, కుటుంబం, తరగతి
Q4. మొక్కల ప్రత్యుత్పత్తిలో సరైన క్రమాన్ని ఎన్నుకొనుము.
a) అండం -> సంయుక్తబీజం -> పిండకోశం -> స్త్రీ బీజకణం -> ఫలదీకరణ -> పిండం
b) అండం -> స్త్రీ బీజకణం -> సంయుక్తబీజం -> పిండకోశం -> ఫలదీకరణ -> పిండం
c) అండం -> పండం -> స్త్రీ బీజకణం -> పిండకోశం -> సంయుక్తబీజం -> ఫలదీకరణ
d) అండం -> పిండకోశం -> స్త్రీ బీజకణం -> ఫలదీకరణ -> సంయుక్తబీజం-> పిండం
Q5. ఈ మారక ద్రవ్యం నాడీ వ్యవస్ధలో డోపమైస్ రవాణాలో జోక్యం చేసుకొంటుంది
a) కొకైన్
b) మార్ఫిన్
c) హెరాయిన్
d) చరాస్
Q6. ఈ విటమిన్‌ను సాధారణంగా సన్‌షైన్ విటమిన్ అంటారు
a) రెటినాల్
b) కాల్సీఫెరాల్
c) నికోటినిక్ ఆమ్లం
d) పాంటోధెనిక్ ఆమ్లం
Q7. ఒక వర్ణ అంధత్వ పురుషునికి జన్మించిన స్త్రీని, వర్ణాంధత్వ స్త్రీ కి జన్మించిన పురుషుడు వివాహమాడితే వారికి కలిగే మగపిల్లల దృష్టి
a) 25% వర్ణాంధత్వం, 75% సాధారణ దృష్టి
b) 50% సాధారణ దృష్టి, 50% వర్ణాంధత్వం
c) 25% సాధారణ దృష్టి, 75% వర్ణాంధత్వం
d) అందరికీ వర్ణాంధత్వం కలుగుతుంది
Q8. తామర వ్యాధికి కారణమైన జీవి
a) సాల్మొనెల్లా
b) స్ట్రెప్టోకోకస్
c) మైక్రోస్పోరం
d) హీమోఫిలస్
Q9. ఆక్వాయిర్డ్ ఇమ్యునోడెఫిషియెంసి సిండ్రోమ్ (ఎయిడ్స్) దీని వలన వస్తుంది ?
a) బాక్టీరియా
b) ప్రోటోజోవా
c) ఫంగస్
d) వైరస్
Q10. ఈ క్రింది వాటిలో ఇది మినహాయించి మిగతావన్ని అకశేరుకాలు ?
a) నత్త
b) పీతలు
c) రొయ్యలు
d) చేపలు
Answers:
1. జవాబు: c
2. జవాబు: c
3. జవాబు: b
4. జవాబు: d
5. జవాబు: a
6. జవాబు: b
7. జవాబు: b
8. జవాబు: c
9. జవాబు: d
10. జవాబు: d

No comments