ప్రముఖ సాహితీవేత్త, రచయిత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యను దాశరథి పురస్కారం వరించింది. జూలై 22న దాశరథి కృష్ణమాచార్యుల జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాశరథి పురస్కారాన్ని అందజేస్తోంది. 2019 సంవత్సరానికిగాను ప్రభుత్వం కూరెళ్లను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఆయన రాసిన 18కి పైగా గ్రంథాలు ఇప్పటివరకు ముద్రితమయ్యాయి. ఆయనకు మధురకవి, అభినవ పోతన, తెలంగాణ వేమన, నల్లగొండ కాళోజీ తదితర బిరుదులున్నాయి.
భారత మాజీ అథ్లెట్, దిగ్గజ ఒలింపియన్ పి.టి. ఉష ఉష (55) అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) ప్రతిప్రతిష్టాత్మక ‘వెటరన్ పిన్’ అవార్డుకు ఎంపిక చేసింది. ప్రపంచ అథ్లెటిక్స్‌లో సుదీర్ఘ కాలం పాటు అందించిన సేవలకు గాను ఐఏఏఎఫ్ వెటరన్ పిన్ అవార్డును అందిస్తుంది.
2019-2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) భారత వృద్ధి అంచనా 7.2 శాతం నుండి 7 శాతానికి తగ్గించింది. అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల వృద్ధి మందగమనం, ప్రపంచ వాణిజ్యంపై దీని ప్రభావం వంటి అంశాలు 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని ఏడీబీ అంచనా వేసింది.
దక్షిణ భారత ఆహారాన్ని అందించడంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన శరవణ భవన్ హోటళ్ల గ్రూప్ అధినేత పి.రాజగోపాల్ (73) చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
తెలుగు విశ్వవిద్యాలయం ఏటా అందించే మండలి వెంకట కృష్ణారావు సంస్కృతి పురస్కారానికి 2019 సంవత్సరానికి గాను ఆచార్య వెల్చేరు నారాయణరావు ఎంపికయ్యారు. అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ తరపున తెలుగు భాష, సాహిత్యానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకు చేసిన కృషికిగాను నారాయణరావు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.
ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ 17,18,19-జులై-2019
Reviewed by Venkat
on
4:49 AM
Rating: 5
_
ReplyDelete